‘అమరాన్‌’కు ‘ప్రిస్టీజియస్‌ బ్రాండ్‌ ఆఫ్‌ ఏషియా 2023’ అవార్డు

అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీకి చెందిన ‘అమరాన్‌’ బ్రాండు  ‘ప్రిస్టీజియస్‌ బ్రాండ్‌ ఆఫ్‌ ఏషియా 2023’ అవార్డుకు ఎంపికైంది.

Published : 01 Mar 2024 01:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీకి చెందిన ‘అమరాన్‌’ బ్రాండు  ‘ప్రిస్టీజియస్‌ బ్రాండ్‌ ఆఫ్‌ ఏషియా 2023’ అవార్డుకు ఎంపికైంది. ‘ఆటోమోటివ్‌ బ్యాటరీస్‌’ విభాగంలో ఈ అవార్డు లభించినట్లు అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ వెల్లడించింది. దుబాయ్‌లో జరిగిన హెరాల్డ్‌ గ్లోబల్‌ అండ్‌ బీఏఆర్‌సీ ఏషియా కార్యక్రమంలో ఈ అవార్డును సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన గౌరినేని అందుకున్నారు. ఆయనకు ‘మార్కెటింగ్‌ మీస్టర్‌ 2023-24’ అవార్డు లభించింది. బ్యాటరీ టెక్నాలజీలో తమ సాంకేతిక నైపుణ్యానికి, తమ ఉత్పత్తుల సామర్థ్యానికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించినట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని