భారత్‌లో 7.4 కోట్ల బెదిరింపులను నిరోధించాం

గత ఏడాది భారత్‌లోని 34 శాతం మంది వినియోగదార్లను స్థానిక బెదిరింపుల ద్వారా లక్ష్యంగా చేసుకున్నారని, తన ఉత్పత్తులు ఇలాంటి 7.43 కోట్ల స్థానిక సంఘటలను గుర్తించి నిరోధించాయని అంతర్జాతీయ సైబర్‌ భద్రత, డిజిటల్‌ గోప్యతా సంస్థ కాస్పర్‌స్కై తెలిపింది.

Published : 03 Mar 2024 01:35 IST

అంతర్జాతీయ సైబర్‌ భద్రతా సంస్థ కాస్పర్‌స్కై

దిల్లీ: గత ఏడాది భారత్‌లోని 34 శాతం మంది వినియోగదార్లను స్థానిక బెదిరింపుల ద్వారా లక్ష్యంగా చేసుకున్నారని, తన ఉత్పత్తులు ఇలాంటి 7.43 కోట్ల స్థానిక సంఘటలను గుర్తించి నిరోధించాయని అంతర్జాతీయ సైబర్‌ భద్రత, డిజిటల్‌ గోప్యతా సంస్థ కాస్పర్‌స్కై తెలిపింది. నేరుగా వినియోగదార్ల కంప్యూటర్లు లేదా వాటికి అనుసంధానం చేసి తీసివేసే ఫ్లాష్‌ డ్రైవ్‌లు, కెమేరా మెమొరీ కార్డ్‌లు, ఫోన్లు, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డ్రైవ్‌లలో హానికరమైన ప్రోగ్రామ్‌లను గుర్తించినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కాస్పర్‌స్కై సెక్యూరిటీ నెట్‌వర్క్‌(కేఎస్‌ఎన్‌) వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌ 80వ స్థానంలో ఉంది. కాస్పర్‌స్కై ఉత్పత్తులు 7,43,85,324 స్థానిక సంఘటనలను గుర్తించి నిరోధించాయి. భారత సైబర్‌ భద్రతా విపణి 2023లో 6.06 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.50,300 కోట్లు)కు చేరింది. సైబర్‌ బెదిరింపులు, సైబర్‌ భద్రతపై దాడులు ప్రస్తుతం చాలా సంస్థలకు పెద్ద సవాలుగా మారిందని, 67 శాతం భారతీయ సంస్థలు వచ్చే మూడేళ్లలో కీలకమైన ఈ విభాగాన్ని పొరుగు సేవల కింద బయటి సంస్థలకు అప్పగించే అవకాశం ఉందని ఆ కంపెనీ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని