సూచీల ‘ప్రత్యేక’ రికార్డులు

ఆకర్షణీయ జీడీపీ గణాంకాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో శనివారం నాటి ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌లోనూ మన స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను అధిరోహించాయి.

Published : 03 Mar 2024 01:36 IST

ఆకర్షణీయ జీడీపీ గణాంకాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో శనివారం నాటి ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌లోనూ మన స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను అధిరోహించాయి. ప్రాథమిక సైట్‌లో వైఫల్యం తలెత్తినా, భారీ అంతరాయం ఏర్పడినా.. ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను రెండు దఫాలుగా నిర్వహించాయి.

ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రాథమిక సైట్‌ (పీఆర్‌)లో, 11:30 నుంచి 12:30 గంటల వరకు డిజాస్టర్‌ రికవరీ (డీఆర్‌) సైట్‌లో ట్రేడింగ్‌ నిర్వహించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60.80 పాయింట్లు, నిఫ్టీ 39.65 పాయింట్లు లాభపడ్డాయి. ఒక దశలో సెన్సెక్స్‌ జీవన కాల గరిష్ఠ స్థాయి అయిన 73,994.70 పాయింట్లను తాకింది. 73,806.15 పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠ ముగింపు నమోదు చేసింది. నిఫ్టీ సైతం ఒక దశలో 80.8 పాయింట్లు లాభపడి 22,419.55 పాయింట్ల వద్ద జీవన కాల ఇంట్రాడే గరిష్ఠానికి చేరింది. చివరకు జీవన కాల గరిష్ఠ స్థాయి అయిన 22,378.40 పాయింట్ల వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని