5 ఏళ్లలో 5500 శాతం లాభాలు!

అదానీ గ్రూప్‌లోని పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్‌ ఎనర్జీ) సంస్థ అదానీ గ్రీన్‌ ఎనర్జీ గత 5 ఏళ్లలో సుమారు 5500 శాతం పెరిగింది. ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు లాభాల పంట పండింది.

Published : 03 Mar 2024 01:37 IST

రూ.35 నుంచి రూ.1971 దాకా పెరిగిన షేరు
మదుపర్ల పంట పండించిన అదానీ గ్రీన్‌ ఎనర్జీ

దిల్లీ: అదానీ గ్రూప్‌లోని పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్‌ ఎనర్జీ) సంస్థ అదానీ గ్రీన్‌ ఎనర్జీ గత 5 ఏళ్లలో సుమారు 5500 శాతం పెరిగింది. ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు లాభాల పంట పండింది. గడిచిన ఏడాది కాలంలో చూసినా, షేరు 250 శాతం మేర వృద్ధి చెందింది. పునరుత్పాదక ఇంధన కంపెనీల్లో దేశంలోనే అతి పెద్ద సంస్థగా కొనసాగుతోంది. సౌర పీవీ డెవలపర్‌గా ప్రపంచంలో రెండో అతి పెద్ద సంస్థగా ఉంది. గత 3 నెలలుగా షేరు పెరుగుతూనే ఉంది. రూ.1,052 నుంచి రూ.1,971కి చేరింది. అంటే 80 శాతం పైగా లాభాలందించింది. గత నెల రోజుల్లో సుమారు 18 శాతం లాభపడింది. 5 ఏళ్ల కిందట షేరు ధర రూ.35 దరిదాపుల్లో ఉండేది.

కారణాలివే?: అదానీ గ్రీన్‌ ఎనర్జీ గుజరాత్‌లోని ఖావ్‌డా ఆర్‌ఈ పార్క్‌లో అతి పెద్ద పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) ఇన్‌స్టలేషన్‌ చేయబోతోంది. ఇక్కడ వచ్చే అయిదేళ్లలో 30 గిగావాట్ల సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ పార్క్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన 12 నెలల్లోనే 551 మెగావాట్ల సౌర సామర్థ్యాన్ని సాధించినట్లు ఇటీవల ప్రకటించిన కంపెనీ, జాతీయ గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా చేయడం ప్రారంభించింది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ ప్రకటించిన ఫలితాలు కూడా షేరు విలువ పెరిగేందుకు దోహదం చేశాయి. అందుకే అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేరు దూసుకెళుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని