విమానాశ్రయాలకు పైపులైన్ల ద్వారా ఇంధన సరఫరా

ప్రస్తుత, త్వరలో రాబోయే విమానాశ్రయాలకు గొట్టపు మార్గం ద్వారా విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్‌) సరఫరా చేసేందుకు పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు(పీఎన్‌జీఆర్‌బీ) ప్రతిపాదించింది.

Published : 03 Mar 2024 01:39 IST

పీఎన్‌జీఆర్‌బీ ప్రతిపాదన

దిల్లీ: ప్రస్తుత, త్వరలో రాబోయే విమానాశ్రయాలకు గొట్టపు మార్గం ద్వారా విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్‌) సరఫరా చేసేందుకు పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు(పీఎన్‌జీఆర్‌బీ) ప్రతిపాదించింది. దీనివల్ల పోటీ పెరిగి, ఇంధన వ్యయాలు తగ్గుతాయన్నది ఉద్దేశం. ప్రస్తుతం రోడ్డు, రైల్వే ద్వారానే ఏటీఎఫ్‌ను రవాణా చేస్తున్నారు. కొన్ని విమానాశ్రయాలకు మాత్రమే పైపులైన్ల ద్వారా సరఫరా అవుతోంది. కొన్ని చోట్ల పైపులైన్లు ఉన్నప్పటికీ...వాటిని వేసిన కంపెనీ మినహా ఇతరులు సరఫరా చేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న, త్వరలో నిర్మించే విమానాశ్రయాలకు విమాన ఇంధన పైపులైన్ల అభివృద్ధి నిమిత్తం ప్రజలు, చమురు మార్కెటింగ్‌ కంపెనీలు, విమానాశ్రయ సంస్థలు, విమానయాన సంస్థల నుంచి పీఎన్‌జీఆర్‌బీ అభిప్రాయాలను ఆహ్వానించింది.

ఉమ్మడి వినియోగం కిందకు తీసుకురావాలి..: ‘పైపులైన్ల ద్వారా ద్రవ ఇంధనాలను సరఫరా చేయడం చౌక రవాణా పద్ధతి. అదే రోడ్డు రవాణా ద్వారా అయితే కాస్త వ్యయంతో కూడుకున్నది. విమానయాన వ్యయాల్లో ఏటీఎఫ్‌ ధర వాటానే అధికంగా ఉంటున్నందున.. పైపులైన్ల ద్వారా ఇంధన సరఫరాతో విమాన ప్రయాణ ఖర్చులు దిగివస్తాయ’ని పీఎన్‌జీఆర్‌బీ పేర్కొంది. అలాగే చమురు మార్కెటింగ్‌ కంపెనీలు(ఓఎంసీలు) నిర్వహిస్తున్న కొన్ని ఏటీఎఫ్‌ పైపులైన్లను కూడా ఉమ్మడి వినియోగం కిందకు తీసుకొని వస్తే.. ఇతర ఓఎంసీలు కూడా వాటిని ఉపయోగించుకుంటాయని, తద్వారా పరిశ్రమలో పోటీ ఏర్పడుతుందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని