తప్పు చేసి.. క్షమాపణ చెబితే సరిపోదు: ఏఐ ప్లాట్‌ఫారాలకు కేంద్రం సూచనలు

ప్రధాని మోదీపై అడిగిన ప్రశ్నలకు గూగుల్‌ ఏఐ ప్లాట్‌ఫామ్‌ ప్రతిస్పందన వివాదం సృష్టించిన కొన్ని రోజుల తర్వాత.. ప్రభుత్వం సామాజిక మాధ్యమ, ఇతర ప్లాట్‌ఫామ్‌లకు సలహా పత్రాన్ని(అడ్వైజరీ) జారీ చేసింది.

Updated : 03 Mar 2024 09:30 IST

దిల్లీ: ప్రధాని మోదీపై అడిగిన ప్రశ్నలకు గూగుల్‌ ఏఐ ప్లాట్‌ఫామ్‌ ప్రతిస్పందన వివాదం సృష్టించిన కొన్ని రోజుల తర్వాత.. ప్రభుత్వం సామాజిక మాధ్యమ, ఇతర ప్లాట్‌ఫామ్‌లకు సలహా పత్రాన్ని(అడ్వైజరీ) జారీ చేసింది. పరీక్ష దశలో ఉన్న ఏఐ నమూనాలను లేబుల్‌ చేయడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను హోస్ట్‌ చేయడాన్ని నిరోధించడానికి ఈ సలహా పత్రాన్ని జారీ చేసింది. ఈ నెల 1న ఇంటర్మీడియరీలు/ప్లాట్‌ఫామ్‌లకు జారీ చేసిన అడ్వైజరీలో.. ఎలక్ట్రానిక్స్‌, సమాచార మంత్రిత్వ శాఖ సూచించిన నిబంధనలు పాటించని పక్షంలో క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ఇంటర్మీడియరీలు లేదా ప్లాట్‌ఫామ్‌లు కృత్రిమ మేధ(ఏఐ) నమూనాలు/ఎల్‌ఎల్‌ఎం/జనరేటివ్‌ ఏఐ, సాఫ్ట్‌వేర్‌లు లేదా అల్గారిథమ్‌లను వాటి కంప్యూటర్‌ రిసోర్స్‌లో లేదా దాన్ని ఉపయోగించడం ద్వారా వినియోగదార్లను హోస్ట్‌ చేయడానికి, అప్‌లోడ్‌ చేయడానికి, సవరించడానికి, ప్రదర్శించడానికి అనుమతించకూడదని సలహా పత్రంలో ప్రభుత్వం సూచించింది. ఏదైనా ఉల్లంఘనలకు అన్ని ప్లాట్‌ఫామ్‌లు, ఇంటర్మీడియరీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.

గూగుల్‌ జెమిని ఏఐ ప్లాట్‌ఫామ్‌ ప్రధాని మోదీ గురించి అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందించిన తీరు ఐటీ చట్టాలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. తన ప్లాట్‌ఫామ్‌ ఇంకా పరీక్ష (ట్రయల్‌) దశలోనే ఉందని గూగుల్‌ అంటున్నా, విచారణ నుంచి తప్పించుకోవడానికి దీన్ని పరిగణనలోకి తీసుకోలేమని తెలిపారు. ముందు తప్పు చేసి తర్వాత క్షమాపణలు చెప్పి బాధ్యతల నుంచి ఏ ప్లాట్‌ఫామ్‌ కూడా తప్పించుకోలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు