Tata Motors: టాటా మోటార్స్‌.. రెండు కంపెనీలుగా

టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించాలనే ప్రతిపాదనకు సోమవారం బోర్డు ఆమోదం తెలిపింది.

Updated : 05 Mar 2024 09:33 IST

వేర్వేరుగా నమోదుకు బోర్డు ఆమోదం
2 సంస్థల్లోనూ వాటాదార్లకు షేర్లు

దిల్లీ: టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించాలనే ప్రతిపాదనకు సోమవారం బోర్డు ఆమోదం తెలిపింది. వాణిజ్య వాహనాల వ్యాపారం, దాని సంబంధిత పెట్టుబడులు ఒక సంస్థగా; ప్రయాణికుల వాహనాల (పీవీలు) వ్యాపారాలు, ఈవీలు (విద్యుత్‌ వాహనాలు), జేఎల్‌ఆర్‌ (జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌), దాని సంబంధిత పెట్టుబడులు మరొక సంస్థగా విడదీయాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్‌ సమాచారమిచ్చింది. ఎన్‌సీఎల్‌టీ స్కీమ్‌ ఆఫ్‌ అరేంజ్‌మెంట్‌ కింద ఈ విభజన ప్రక్రియ జరుగుతుందని, టాటా మోటార్స్‌ వాటాదార్లందరికీ ఈ రెండు నమోదిత సంస్థల్లో షేర్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ‘ప్రస్తుతం 3 వాహన వ్యాపారాలు స్వతంత్రంగా స్థిరమైన పనితీరు ప్రదర్శిస్తున్నాయి. విభజన ద్వారా విపణిలో ఉన్న అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు, ఆయా విభాగాల్లో దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం లభిస్తుంది. వాటాదార్లు, రుణదాతలు, నియంత్రణ సంస్థల అనుమతులు రావడానికి మరో 12-15 నెలల సమయం పట్టొచ్చు. ఈ విభజనతో ఉద్యోగులు, వినియోగదార్లు, మా వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రభావం పడద’ని టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని