సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్‌ రెడ్డీస్‌

సనోఫి హెల్త్‌కేర్‌ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పంపిణీ చేయనుంది.

Published : 28 Mar 2024 02:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: సనోఫి హెల్త్‌కేర్‌ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పంపిణీ చేయనుంది. చిన్న పిల్లలు, పెద్దల కోసం సనోఫి ఉత్పత్తి చేస్తున్న టీకాలైన హెగ్జాజిమ్‌, పెంటాగ్జిమ్‌, టెట్రాగ్జిమ్‌, మెనక్ట్రా, ఫ్లూక్వాడ్రి, అడాసెల్‌, అవాగ్జిమ్‌ 80యూ బ్రాండ్లను డాక్టర్‌ రెడ్డీస్‌ పంపిణీ చేస్తుంది. ఈ బ్రాండ్ల వార్షిక అమ్మకాలు రూ.425 కోట్లకు పైగానే ఉంటున్నాయి. ఈ టీకాల ఉత్పత్తి, దిగుమతి బాధ్యతలను సనోఫి నిర్వహిస్తుంది. దేశీయంగా పంపిణీ, విక్రయాలను డాక్టర్‌ రెడ్డీస్‌ చేపడుతుంది. దీనివల్ల టీకాల విభాగంలో రెండో స్థానంలోకి చేరే అవకాశం తమకు కలుగుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ (ఇండియా, ఎమర్జింగ్‌ మార్కెట్స్‌)    ఎం.వి.రమణ వివరించారు. భారతదేశంలో తమ అమ్మకాలు పెంచుకునేందుకు ఈ ఒప్పందం వీలుకల్పిస్తుందని సనోఫి ఇండియా జీఎం (వ్యాక్సిన్స్‌) ప్రీతి ఫుట్నాని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని