కూకట్‌పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్‌ సంస్థ జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ బుధవారం వెల్లడించింది.

Published : 28 Mar 2024 02:04 IST

విక్రయానికి స్వ్కేర్‌స్పేస్‌తో ఒప్పందం

ముంబయి: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్‌ సంస్థ జీఓసీఎల్‌ కార్పొరేషన్‌ బుధవారం వెల్లడించింది. ఇందుకోసం హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్వ్కేర్‌స్పేస్‌ బిల్డర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా 32 ఎకరాల స్థలాన్ని హిందూజా హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (హెచ్‌హెచ్‌ఎల్‌ - గతంలో హిందూజా ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)తో కలిసి అభివృద్ధి చేసేలా జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ (జేడీఏ) కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ ప్రక్రియ అంతా 18 నెలల్లో  పూర్తవ్వాల్సి ఉందని తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి వాయిదా కింద రూ.520 కోట్లను అందుకుంటామని జీఓసీఎల్‌ పేర్కొంది. జేడీఏ కింద అభివృద్ధి చేస్తున్న 32 ఎకరాల్లో    12.50 ఎకరాలను వెంటనే విక్రయిస్తామని వివరించింది. తమకు మొదటి వాయిదాగా అందే రూ.520 కోట్లలో, రూ.160 కోట్లు ఈ 12.50 ఎకరాల అమ్మకం ద్వారానే లభిస్తాయని తెలిపింది. తదుపరి దశల్లో జరిగే విక్రయాల ద్వారా మిగిలిన నిధులు కంపెనీకి చేరతాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని