చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ (సీపీసీఎల్‌) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్‌ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది.

Published : 29 Mar 2024 01:09 IST

దిల్లీ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ (సీపీసీఎల్‌) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్‌ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. ఈ ప్రాజెక్టు వ్యయాలు 12% పైగా పెరగడమే ఇందుకు కారణం. ఐఓసీ, సీపీసీఎల్‌ ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థలో ఈ రెండు కంపెనీలకు 25%  చొప్పున వాటాలున్నాయి. మిగతా 50% వాటా ఆర్థిక పెట్టుబడిదార్లకు ఉండాలి. అయితే రిఫైనరీ నిర్మాణ వ్యయాన్ని రూ.29,361 కోట్ల నుంచి 12.3% పెంచి రూ.33,023 కోట్లకు సవరించడానికి బోర్డు సమావేశంలో ఆమోదం లభించిందని గురువారం ఎక్స్ఛేంజీలకు ఐఓసీ సమాచారమిచ్చింది. దక్షిణ భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల గిరాకీని తీర్చడం కోసం కావేరీ బేసిన్‌లో 9 మి. టన్నుల వార్షిక సామర్థ్యంతో రిఫైనరీ ఏర్పాటుకు 2021  జనవరి 29న ఐఓసీ బోర్డు ఆమోదం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని