యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్‌పే

తమ వినియోగదార్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్‌ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్‌పే తెలిపింది.

Updated : 29 Mar 2024 04:41 IST

దిల్లీ: తమ వినియోగదార్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్‌ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్‌పే తెలిపింది. ఖాతాల్లోకి డబ్బులు భారత రూపాయల్లోనే జమ అవుతాయని, కరెన్సీ మారకపు రేటును కూడా తెలియజేస్తుందని పేర్కొంది. పర్యాటక, విడిది ప్రాంతాలు సహా పలు రిటైల్‌ విక్రయకేంద్రాలు, డైనింగ్‌ అవుట్‌లెట్ల వద్ద నియోపే టెర్మినళ్లు ఉన్నాయని ఫోన్‌పే సీఈఓ (అంతర్జాతీయ చెల్లింపులు) రితేశ్‌ పాయ్‌ తెలిపారు. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐపీఎల్‌), మాష్రెఖ్‌ మధ్య భాగస్వామ్యం ద్వారా ఈ సదుపాయానికి అవకాశం కలిగింది. యూపీఐ చెల్లింపుల లావాదేవీల నిమిత్తం.. ప్రవాస భారతీయులు తమ యూఏఈ మొబైల్‌ నంబర్ల ద్వారా ఫోన్‌పే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రస్తుత నాన్‌- రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ ఖాతాను (ఎన్‌ఆర్‌ఈ), నాన్‌- రెసిడెంట్‌ ఆర్డినరీ ఖాతాలను (ఎన్‌ఆర్‌ఓ) అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో ఆర్జించిన డబ్బును మన దేశానికి భారత కరెన్సీలో పంపించేందుకు ఎన్‌ఆర్‌ఈ ఖాతాలను ఎన్‌ఆర్‌ఐలు ఉపయోగిస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని