ఎంఎస్‌డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు

ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్‌డీ (మెర్క్‌ షార్ప్‌ అండ్‌ దోహ్మే సింగపూర్‌ ట్రేడింగ్‌ పీటీఈ లిమిటెడ్‌), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు  కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది.

Published : 29 Mar 2024 01:11 IST

అరబిందో ఫార్మా 

ఈనాడు, హైదరాబాద్‌: ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్‌డీ (మెర్క్‌ షార్ప్‌ అండ్‌ దోహ్మే సింగపూర్‌ ట్రేడింగ్‌ పీటీఈ లిమిటెడ్‌), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు  కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. కాంట్రాక్టు తయారీ ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం కొంతకాలంగా రెండు సంస్థల మధ్య సంప్రదింపులు సాగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి కావాలి, కానీ పూర్తి చేయలేకపోతున్నారు. అందువల్లే మరో 2 నెలల పాటు గడువు పెంచి, మే నెలాఖరుకు ప్రక్రియను పూర్తి చేయాలని తాజాగా నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రధానంగా బయోలాజిక్స్‌ విభాగానికి చెందిన ఔషధాలను ఎంఎస్‌డీ కోసం ఉత్పత్తి చేయడానికి క్యూరాటెక్‌ బయోలాజిక్స్‌ ఆసక్తిగా ఉంది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని క్యూరాటెక్‌ బయో సమకూర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని