యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు

యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు.

Published : 29 Mar 2024 01:15 IST

డేటా ఉల్లంఘనలు జరగలేదన్న బ్యాంక్‌

ముంబయి: యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. కొన్ని ఇ-కామర్స్‌ సైట్లలో తమ కార్డుల ద్వారా తక్కువ విలువ (లో వాల్యూ) కొనుగోళ్లు జరిగినట్లు లావాదేవీ అలర్ట్‌లు మంగళవారం సాయంత్రం పలువురు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదార్లకు వచ్చాయని బ్యాంక్‌ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ హెడ్‌ సంజీవ్‌ మోఘే వెల్లడించారు. ఈ లావాదేవీలన్నీ సదరు వినియోగదార్ల ధ్రువీకరణతో జరిగినవి కావని పేర్కొన్నారు. అయితే బ్యాంక్‌ వైపు నుంచి వినియోగదార్ల డేటా ఉల్లంఘనలు ఏమీ జరగలేదని గుర్తించినట్లు తెలిపారు. మోసపూరిత లావాదేవీలు చాలా పరిమితమని, ఖాతాదార్ల డేటా సురక్షితంగా ఉందని వివరించారు. బ్యాంక్‌ అంతర్గత వ్యవస్థలు కొన్ని లావాదేవీలను ఆపగలిగాయని, అయినప్పటికీ కొంత మంది వినియోగదార్లు ప్రభావితమయ్యారని వెల్లడించారు. తమ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఖాతాదార్లు ఒక రోజుకు రూ.500 కోట్ల వ్యయాలు చేస్తుంటారని, వాటితో పోలిస్తే ఈ అనధికారిక లావాదేవీల విలువ చాలా తక్కువని తెలిపారు. బహుశా రూ. వేలల్లో లేదా లక్షల్లో మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని