నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి

దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల  బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది.

Published : 29 Mar 2024 01:18 IST

ఫిబ్రవరిలో 6.7%

దిల్లీ: దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల  బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. ఈ ఏడాది జనవరి వృద్ధి 4.1 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువే. 2023 ఫిబ్రవరిలో నమోదైన 7.4 శాతం వృద్ధితో పోలిస్తే తక్కువ. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ రంగాలను కీలక రంగాలుగా పరిగణిస్తారు. 

  • ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య కీలక రంగాల వృద్ధి 7.7 శాతానికి పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది 8.2%. ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి ప్రతికూలంగా నమోదు కావడం గమనార్హం. దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ 8 కీలక రంగాల వాటా 40.27% ఉంటుంది.
  • గణాంకాల ప్రకారం.. రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, విద్యుత్‌ రంగాల ఉత్పత్తి ఫిబ్రవరిలో తగ్గింది. బొగ్గు 11.6%, ముడి చమురు 7.9%, సహజ వాయువు 11.3%, సిమెంట్‌ 10.2% మేర ఆరోగ్యకర వృద్ధిని నమోదు చేశాయి. ‘కీలక రంగాల వృద్ధి 3 నెలల గరిష్ఠానికి చేరింది. 8 రంగాల్లో 3 రంగాలు రెండంకెల వృద్ధి సాధించాయి. ఆరోగ్యకర కీలక రంగాల వృద్ధితో 2024 ఫిబ్రవరి ఐఐపీ వృద్ధి 6-6.5 శాతం పెరగొచ్చని అంచనా వేస్తున్నామ’ని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ వెల్లడించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని