అధీకృత షేర్‌ క్యాపిటల్‌ పెంపునకు అభ్యంతరం చెప్పని బైజూస్‌ వాటాదార్లు

బైజూస్‌ బ్రాండ్‌పై కార్యకలాపాలు సాగిస్తున్న ఎడ్‌టెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌, తన అధీకృత షేర్‌ క్యాపిటల్‌ పెంచుకోవడానికి అసాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్‌)లో చేసిన తీర్మానానికి వాటాదార్లు ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తలేదు.

Published : 30 Mar 2024 03:03 IST

దిల్లీ: బైజూస్‌ బ్రాండ్‌పై కార్యకలాపాలు సాగిస్తున్న ఎడ్‌టెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌, తన అధీకృత షేర్‌ క్యాపిటల్‌ పెంచుకోవడానికి అసాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్‌)లో చేసిన తీర్మానానికి వాటాదార్లు ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తలేదు. దీంతో రైట్స్‌ ఇష్యూ ద్వారా ఫిబ్రవరిలో సేకరించిన 200 మి. డాలర్ల (దాదాపు రూ.1600 కోట్ల)ను కంపెనీలోకి జొప్పించడానికి మార్గం సుగమం అయినట్లయిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. బైజూస్‌ వ్యవస్థాపకుడు, ఆయన కుటుంబ సభ్యులను యాజమాన్య స్థానం నుంచి తప్పించాలని ప్రతిపాదించిన మదుపర్లెవరూ ఈ సమావేశంలో పాల్గొనలేదని ఆ వర్గాలు తెలిపాయి. అయితే వారి అధీకృత ప్రతినిధులు పాల్గొన్నారని వివరించాయి. ఏప్రిల్‌ 6 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి తుది ఫలితం ‘స్క్రూటినైజర్స్‌ రిపోర్ట్‌’ ద్వారా తెలుస్తుంది. 2022 మార్చిలో 22 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.82 లక్షల కోట్లు) విలువ పలికిన బైజూస్‌.. అందులో 99% తక్కువ విలువ వద్ద రైట్స్‌ ఇష్యూ ద్వారా 200 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1660 కోట్ల)ను సేకరించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని