ఆకాశ ఎయిర్‌ అంతర్జాతీయ సేవలు ప్రారంభం

దేశీయ విమానయాన సేవల సంస్థ ఆకాశ ఎయిర్‌, అంతర్జాతీయ మార్గాల్లోనూ కార్యకలాపాలను ప్రారంభించింది. తొలి విమానం ముంబయి నుంచి దోహా (ఖతార్‌)కు వెళ్లింది.

Published : 30 Mar 2024 03:04 IST

ముంబయి: దేశీయ విమానయాన సేవల సంస్థ ఆకాశ ఎయిర్‌, అంతర్జాతీయ మార్గాల్లోనూ కార్యకలాపాలను ప్రారంభించింది. తొలి విమానం ముంబయి నుంచి దోహా (ఖతార్‌)కు వెళ్లింది. కువైట్‌, జెద్దా, రియాద్‌లకూ విమాన సర్వీసులు నిర్వహించేందుకు ఈ సంస్థకు అనుమతులు లభించినట్లు తెలిపింది. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని గమ్యస్థానాలను వేగంగా జత చేయగలమని పేర్కొంది. అహ్మదాబాద్‌, గోవా, వారణాసి, లఖ్‌నవూ, బెంగళూరు, దిల్లీ వంటి దేశీయ నగరాల నుంచి దోహాకు వెళ్లి వచ్చేవారికి సౌలభ్యంగా ఉండేలా విమాన షెడ్యూళ్లలో మార్పులు చేయనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని