జనరేటివ్‌ ఏఐలో 3.5 లక్షల మంది టీసీఎస్‌ ఉద్యోగులకు శిక్షణ

జనరేటివ్‌ ఏఐ నైపుణ్యాల్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) పేర్కొంది.

Published : 30 Mar 2024 03:04 IST

ముంబయి: జనరేటివ్‌ ఏఐ నైపుణ్యాల్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) పేర్కొంది. 1.5 లక్షల మంది సిబ్బందికి ఈ నైపుణ్యాలను నేర్పించినట్లు జనవరిలో ప్రకటించిన ఈ సంస్థ, తాజాగా తన ఉద్యోగుల్లో సగం మందికి శిక్షణ ఇప్పించినట్లు పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక ఏఐ నైపుణ్యాలున్న ఉద్యోగులను కలిగిన కంపెనీల్లో ఒకటిగా టీసీఎస్‌ నిలవగలదని సంస్థ తెలిపింది. ఏఐ, క్లౌడ్‌కు ప్రత్యేకంగా వ్యాపార యూనిట్‌ను ఏర్పాటు చేసిన తొలి ఐటీ కంపెనీగా 2023లో టీసీఎస్‌ నిలిచింది.

విమానయాన కంపెనీలకు సేవలు: విమానం ఆలస్యమైనపుడు లేదా రద్దయినపుడు.. ప్రత్యామ్నాయ మార్గాలను తమ వినియోగదార్లకు సూచించడానికి విమానయాన సంస్థలకు జెన్‌ ఏఐ అప్లికేషన్లనూ టీసీఎస్‌ రూపొందించింది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) తమను జెనరేటివ్‌ ఏఐ కాంపిటెన్సీ పార్టనర్‌గా గుర్తించిందని టీసీఎస్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని