ప్రభుత్వ పోర్టల్‌ జీఈఎమ్‌లో రూ.4 లక్షల కోట్లకు పైగా కొనుగోళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇప్పటి దాకా ప్రభుత్వ పోర్టల్‌ అయిన జీఈఎమ్‌ ద్వారా జరిగిన వస్తువులు, సేవల సేకరణ రూ.4 లక్షల కోట్లను అధిగమించినట్లు ఆ పోర్టల్‌ సీఈఓ పీకే సింగ్‌ పేర్కొన్నారు.

Published : 30 Mar 2024 03:05 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇప్పటి దాకా ప్రభుత్వ పోర్టల్‌ అయిన జీఈఎమ్‌ ద్వారా జరిగిన వస్తువులు, సేవల సేకరణ రూ.4 లక్షల కోట్లను అధిగమించినట్లు ఆ పోర్టల్‌ సీఈఓ పీకే సింగ్‌ పేర్కొన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి అధిక కొనుగోలు కార్యకలాపాలు జరగడం ఇందుకు దోహదం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఆన్‌లైన్‌లో వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి 2016 ఆగస్టు 9న గవర్న్‌మెంట్‌ ఇ-మార్కెట్‌ (జీఈఎమ్‌)ను ఆవిష్కరించింది. రక్షణ రంగ సంస్థలు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పలు వస్తువులు, సేవలను కొనుగోలు చేసినట్లు సింగ్‌ వెల్లడించారు. బ్రహ్మోస్‌ మిసైల్‌ అసెంబ్లీని జీఈఎమ్‌ ఒక సర్వీసు కాంట్రాక్టు ద్వారా పూర్తి చేసిందని ఆయన వివరించారు. 2021-22లో కొనుగోళ్ల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉండగా..గత ఆర్థిక సంవత్సరం రూ.2 లక్షల కోట్లను అధిగమించిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని