ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ అధ్యక్షురాలిగా జోయ్‌శ్రీ దాస్‌ వర్మ

ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) 41వ జాతీయ అధ్యక్షురాలిగా జోయ్‌శ్రీ దాస్‌ వర్మ బాధ్యతలు స్వీకరించారు. 2024-25 ఏడాదికి ఆమె ఈ హోదాలో కొనసాగుతారు.

Published : 30 Mar 2024 03:06 IST

దిల్లీ: ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) 41వ జాతీయ అధ్యక్షురాలిగా జోయ్‌శ్రీ దాస్‌ వర్మ బాధ్యతలు స్వీకరించారు. 2024-25 ఏడాదికి ఆమె ఈ హోదాలో కొనసాగుతారు. ఈశాన్య భారతానికి గౌరవ కాన్సుల్‌గా వర్మను ఇజ్రాయెల్‌ నియమించుకుంది. కాప్రో మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌కు డైరెక్టర్‌గా వర్మ వ్యవహరిస్తున్నారు. ఎఫ్‌ఎల్‌ఓకు నేతృత్వం వహించడం గౌరవంగా భావిస్తానని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని