జీవనకాల గరిష్ఠానికి ఫారెక్స్‌ నిల్వలు

భారత ఫారెక్స్‌ (విదేశీ మారకపు) నిల్వలు ఈ నెల 22తో ముగిసిన వారంలో 140 మిలియన్‌ డాలర్లు పెరిగి జీవన కాల గరిష్ఠ స్థాయి అయిన 642.631 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది.

Published : 31 Mar 2024 02:31 IST

ముంబయి: భారత ఫారెక్స్‌ (విదేశీ మారకపు) నిల్వలు ఈ నెల 22తో ముగిసిన వారంలో 140 మిలియన్‌ డాలర్లు పెరిగి జీవన కాల గరిష్ఠ స్థాయి అయిన 642.631 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది. 2021 సెప్టెంబరులో ఇవి 642.453 బి.డాలర్లుగా నమోదయ్యాయి. ఆ తరవాత మళ్లీ ఇదే గరిష్ఠ స్థాయి. ఫారెక్స్‌ నిల్వల్లో ప్రధానమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 123 మి.డాలర్లు తగ్గి  568.264 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. పసిడి నిల్వలు 347 మి.డాలర్లు పెరిగి 51.487 బి.డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్‌ వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌లు) 57 మి.డాలర్లు తగ్గి 18.129 బి.డాలర్లకు పరిమితమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు