89% ఉద్యోగులకు సవాళ్లే ప్రేరణ: సర్వే

భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 89 శాతం మందికి సవాళ్లు, అదనపు బాధ్యతలే అత్యంత ప్రేరణనిస్తాయని ఓ సర్వేలో తేలింది.

Published : 31 Mar 2024 02:36 IST

ముంబయి: భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 89 శాతం మందికి సవాళ్లు, అదనపు బాధ్యతలే అత్యంత ప్రేరణనిస్తాయని ఓ సర్వేలో తేలింది. భారత్‌ సహా 10 దేశాల్లో 4,000కు పైగా ఉద్యోగులు, మేనేజర్లు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లతో యూకేజీ వర్క్‌ఫోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ సర్వేను నిర్వహించింది. దీని ప్రకారం భారత ఉద్యోగులు ఏమనుకుంటున్నారంటే..

  • తమ మేనేజర్ల మద్దతు, ప్రోత్సాహం, నాయకత్వం తమను ముందుకు నడిపిస్తోందని ప్రతీ నలుగురిలో ముగ్గురు(72%) తెలిపారు.
  • ప్రతీ విషయంలో అధికారం చెలాయించకుండా ఉండే మంచి మేనేజర్‌తోనే అత్యంత ఉత్పాదకతను సాధించగలమని 40 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. అయితే 78 శాతం మంది మాత్రం పని ఒత్తిడి కారణంగా శారీరకంగా, మానసికంగా అలసి పోతున్నామని చెబుతున్నారు.
  • పనిభారాన్ని తగ్గించే పక్షంలో కొంత వేతన కోతకూ సిద్ధమని 64 శాతం మంది ఉద్యోగులు అంటున్నారు. పని-జీవితం మధ్య ఆరోగ్యకరమైన సమతౌల్యం ఉండాల్సిన అవసరాన్ని చాలా వరకు ఉద్యోగులు గుర్తిస్తున్నారని ఇది సూచిస్తోంది.
  • ఉద్యోగం అనేది కేవలం బతకడానికే అన్న ధోరణి నుంచి చాలా మంది బయటకు వచ్చారు. తమ సంస్థలో మార్పునకు తామూ అండగా ఉండాలని 72 శాతం మంది నిజాయతీగా కోరుకుంటున్నారు.
  • సంస్థ వ్యాపారంపై తమ పాత్ర ఎలా ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తెలిసేలా తమ మేనేజర్లు సహాయం చేస్తున్నారని 91% మంది పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని