శ్రీచైతన్య విద్యా సంస్థల ప్రచారకర్తగా శ్రీలీల

శ్రీచైతన్య బ్రాండ్‌ అంబాసిడర్‌(ప్రచారకర్త)గా కథానాయిక శ్రీలీలను ఎంపిక చేసినట్లు విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మశ్రీ బొప్పన తెలిపారు.

Published : 31 Mar 2024 02:38 IST

హైదరాబాద్‌: శ్రీచైతన్య బ్రాండ్‌ అంబాసిడర్‌(ప్రచారకర్త)గా కథానాయిక శ్రీలీలను ఎంపిక చేసినట్లు విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మశ్రీ బొప్పన తెలిపారు. ఆమె ప్రచారకర్తగా వ్యవహరించడంతో తమ విద్యా సంస్థలు ప్రజలకు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. శ్రీచైతన్య విద్యా సంస్థలు మరిన్ని కొత్త మైలురాళ్లు అధిగమించేందుకు శ్రీలీల తోడ్పడుతుందని వెల్లడించారు. శ్రీలీల మాట్లాడుతూ శ్రీచైతన్య అంటే విద్యా రంగంలో ఒక అద్వితీయమైన శక్తి అని, విద్యార్థులను విజయ తీరాలకు చేర్చే దిక్సూచి అని తెలిపారు. తనను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని