1 నుంచి డిజిటల్‌ రూపంలో బీమా పాలసీలు

2024 ఏప్రిల్‌ 1 నుంచి బీమా పాలసీలు కొనుగోలు చేస్తే, ఆయా సంస్థలు డిజిటల్‌ రూపంలోనే పాలసీలను అందించనున్నాయి.

Published : 31 Mar 2024 02:44 IST

దిల్లీ: 2024 ఏప్రిల్‌ 1 నుంచి బీమా పాలసీలు కొనుగోలు చేస్తే, ఆయా సంస్థలు డిజిటల్‌ రూపంలోనే పాలసీలను అందించనున్నాయి. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఆదేశాల మేరకు పాలసీదార్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ విధానంలోకి సంస్థలు మారుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో డీమ్యాట్‌ తరహాలోనే బీమా పాలసీలకూ డీమెటీరియలైజ్డ్‌ ఫామ్‌లో 4 బీమా రిపాజిటరీలను ఏర్పాటు చేశారు. సీఏఎంఎస్‌ రిపాజిటరీ, కార్వీ, ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌డీఎంఎల్‌), సెంట్రల్‌ ఇన్సూరెన్స్‌ రిపాజిటరీ ఆఫ్‌ ఇండియాలు వీటిని నిర్వహిస్తాయి.

  • ఇ-ఇన్సూరెన్స్‌ ఖాతాలు డిజిటల్‌ రూపంలో పాలసీలను జారీ చేయడం, నిర్వహించడం చేస్తుంటాయి. ప్రైవేటు బీమా సంస్థలు ఇప్పటికే ఇ-ఇన్సూరెన్స్‌ ఖాతాలను పాలసీదార్ల కోసం ప్రారంభించాయి. పాలసీదార్లు ఎలక్ట్రానిక్‌ రూపంలో ఇతర పాలసీల కొనుగోలుకు, దాచుకోవడానికి వీటిని ఎంచుకోవచ్చు.
  • ఇ-ఇన్సూరెన్స్‌ ఖాతాను తాజా పాలసీ కొనుగోలు చేసే సమయంలోనే ప్రారంభించవచ్చు. ప్రస్తుతమున్న భౌతిక బీమా పాలసీలనూ ఎలక్ట్రానిక్‌ రూపంలోకి మార్పిడి చేసుకోవచ్చు. ఇ-ఇన్సూరెన్స్‌ ఖాతాను ఉచితంగానే తెరవొచ్చు.
  • పాత పాలసీలను మాత్రం భౌతిక రూపం(ఫిజికల్‌ ఫామ్‌)లో కొనసాగించుకొనే అవకాశం కల్పిస్తున్నారు. బీమా పాలసీని కొనుగోలు చేయడానికి ప్రతిపాదన ఫామ్‌ను నింపేటప్పుడు పాలసీదార్లు భౌతిక కాపీని కూడా కోరవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని