రిలయన్స్‌ గ్యాస్‌ ధర తగ్గింపు

కేజీ-డీ6 లాంటి సంక్లిష్ట చమురు క్షేత్రాల నుంచి రిలయన్స్‌ ఉత్పత్తి చేస్తున్న సహజ వాయువు ధరను ప్రభుత్వం స్వల్పంగా తగ్గించింది.

Published : 01 Apr 2024 01:54 IST

దిల్లీ: కేజీ-డీ6 లాంటి సంక్లిష్ట చమురు క్షేత్రాల నుంచి రిలయన్స్‌ ఉత్పత్తి చేస్తున్న సహజ వాయువు ధరను ప్రభుత్వం స్వల్పంగా తగ్గించింది. ప్రస్తుతం సహజవాయువు మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌ (ఎంఎంబీటీయూ) ధర 9.96 డాలర్లుగా ఉండగా.. ఏప్రిల్‌ 1తో ప్రారంభమయ్యే 6 నెలల కాలానికి ధరను 9.87 డాలర్లకు ప్రభుత్వం సవరించింది. అంతర్జాతీయ గ్యాస్‌ ధరలకు అనుగుణంగా ఈ ధరలను నిర్ణయించినట్లు పేర్కొంది. వంటగ్యాస్‌ తయారీకి వినియోగించే గ్యాస్‌ ధరల్లో మాత్రం మార్పులు చేయలేదు. మార్కెట్‌ రేట్ల కంటే 30% తక్కువగా ధరలను నిర్ణయించడమే ఇందుకు కారణం. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు ధరను ప్రభుత్వం ఏటా రెండు సార్లు- ఏప్రిల్‌ 1న, అక్టోబరు 1న నిర్ణయిస్తుంది. కఠిన క్షేత్రాల నుంచి వెలికితీసే సహజవాయువు ధరలను తగ్గించడం ఇది వరుసగా మూడోసారి. 2022 అక్టోబరు- 2023 మార్చికి 12.46 డాలర్లుగా ఉన్న ధరను 2023 ఏప్రిల్‌-సెప్టెంబరులో 12.12 డాలర్లకు తగ్గించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని