ఇన్ఫోసిస్‌కు రూ.6,329 కోట్ల పన్ను రిఫండ్‌

ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నుంచి రూ.6,329 కోట్ల పన్ను రిఫండ్‌ అందుకోనున్నట్లు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

Published : 01 Apr 2024 01:56 IST

దిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నుంచి రూ.6,329 కోట్ల పన్ను రిఫండ్‌ అందుకోనున్నట్లు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. వివిధ మదింపు ఆదేశాలతో రూ.2,763 కోట్ల పన్ను డిమాండ్‌లు కూడా ఉన్నట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. 2007-08 నుంచి 2015-16, 2017-18, 2018-19 మదింపు సంవత్సరాలకు పన్ను డిమాండ్‌ ఆదేశాలను గత త్రైమాసికంలో అందుకున్నట్లు వివరించింది. రూ.6,329 కోట్ల పన్ను రిఫండ్‌ (వడ్డీతో కలిపి) లభిస్తుందని కంపెనీ ఆశిస్తోందని, 2023-24 మార్చితో ముగిసిన త్రైమాసికం, ఆర్థిక సంవత్సర ఖాతాల్లో ఈ మొత్తాన్ని చేర్చే ప్రక్రియలో ఉన్నట్లు పేర్కొంది. మార్చి త్రైమాసికం, 2023-24 ఆర్థిక సంవత్సర ఫలితాలను ఏప్రిల్‌ 18న ఇన్ఫోసిస్‌ ప్రకటించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని