రాగి దిద్దుబాటు!

పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.66,729 దిగువన షార్ట్‌ సెల్‌ పొజిషన్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.65,734; రూ.65,169 వరకు పడిపోయే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.

Published : 01 Apr 2024 02:01 IST

కమొడిటీస్‌
ఈ వారం

పసిడి

సిడి ఏప్రిల్‌ కాంట్రాక్టుకు ఈవారం రూ.66,729 దిగువన షార్ట్‌ సెల్‌ పొజిషన్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.65,734; రూ.65,169 వరకు పడిపోయే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఒకవేళ సానుకూల ధోరణిలో చలిస్తే రూ.68,289 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.68,854; రూ.69,849 వరకు రాణిస్తుందని భావించొచ్చు.


వెండి

వెండి మే కాంట్రాక్టు రూ.74,395 కంటే కిందకు వస్తే రూ.74,135 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.74,880 కంటే ఎగువన కదలాడితే రూ.75,105 వరకు రాణించే అవకాశం ఉంటుంది.


ప్రాథమిక లోహాలు

  • రాగి ఏప్రిల్‌ కాంట్రాక్టులో లాభాల స్వీకరణ కారణంగా దిద్దుబాటు చోటుచేసుకోవచ్చు. అయితే రూ.755.05 వద్ద మద్దతు లభించే అవకాశం ఉంటుంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.749.45 వరకు దిగిరావచ్చు. అదేవిధంగా సానుకూలంగా చలిస్తే రూ.765.25 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.769.75 వరకు పెరగొచ్చు.
  • సీసం ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.177.05 కంటే దిగువన కదలాడితే రూ.175.75కు దిగిరావచ్చు. అదేవిధంగా రూ.179.25 కంటే పైన చలిస్తే  రూ.180.15 వరకు  పెరగొచ్చు.
  • జింక్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.215.35 దిగువన ట్రేడయితే.. మరింతగా పడిపోయే అవకాశం ఉంది.
  • అల్యూమినియం ఏప్రిల్‌ కాంట్రాక్టు ప్రతికూల ధోరణిలో చలిస్తే రూ.206.85 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.204.95కు దిగి రావచ్చు. ఒకవేళ రూ.210.05 కంటే పైకి వెళితే రూ.211.35 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

ఇంధన రంగం

  • ముడి చమురు ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.6,784 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే సానుకూల ధోరణికి అవకాశం ఉంటుంది. రూ.6,984 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.7,053; రూ.7,184కు పెరగొచ్చు. ఒకవేళ రూ.6,784 కంటే కిందకు వస్తే రూ.6,653; రూ.6584కు పడిపోవచ్చు.
  • సహజవాయువు ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.133.95 కంటే కిందకు వస్తే రూ.121.35 వరకు దిగిరావచ్చు. ఒకవేళ రూ.156.25 ఎగువన చలిస్తే రూ.165.95 వరకు రాణించే అవకాశం ఉంది.

వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు ఏప్రిల్‌ కాంట్రాక్టు సానుకూల ధోరణిలో చలిస్తే రూ.17,833 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.18,516; రూ.19,033 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.16,633 కంటే కిందకు వస్తే రూ.16,116; రూ.15,433 వరకు పడిపోవచ్చు.
  • పత్తి క్యాండీ మే కాంట్రాక్టు రూ.62,660 ఎగువన కదలాడితే కొంత కొనుగోళ్ల మద్దతు లభించేందుకు అవకాశం ఉంది. అయితే రూ.62,980 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.63,960 వరకు పెరుగుతుందని భావించొచ్చు.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు