పైలెట్లు లేక విస్తారా విమానాల రద్దు!

విస్తారా తాత్కాలికంగా తన విమాన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. పైలెట్లు, చాలా వరకు ఫస్ట్‌ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణం.

Published : 02 Apr 2024 01:53 IST

ముంబయి: విస్తారా తాత్కాలికంగా తన విమాన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. పైలెట్లు, చాలా వరకు ఫస్ట్‌ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణం. వేతన సవరణకు వ్యతిరేకంగా అనారోగ్య సెలవులో వీరు వెళ్లడంతో, సోమవారం దాదాపు 50 సర్వీసులు రద్దు అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం ఈ సంఖ్య 70కి చేరొచ్చని అంచనా. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో పాటు పలు కారణాల వల్ల విమానాల రద్దు, ఆలస్యం చోటు చేసుకుంటోందని విస్తారా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. విమాన సర్వీసుల రద్దుపై ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు తెలిపింది. సర్వీసుల రద్దుకు కారణాలను వెల్లడించలేదు. త్వరలోనే సాధారణ స్థాయిలో కార్యకలాపాలను చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని