పన్ను విధానంలో మార్పులేమీ లేవు

వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు వర్తించే కొత్త పన్ను విధానంలో ఎలాంటి మార్పులను కొత్త ఆర్థిక సంవత్సరంలో చేయలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టం చేసింది.

Published : 02 Apr 2024 01:56 IST

స్పష్టం చేసిన ఆర్థిక శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు వర్తించే కొత్త పన్ను విధానంలో ఎలాంటి మార్పులను కొత్త ఆర్థిక సంవత్సరంలో చేయలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టం చేసింది. 2024-25 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వరకు కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకునేందుకు వీలుందని పేర్కొంది. వ్యాపారాదాయం లేని వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరం కొత్త, పాత పన్ను విధానాల్లో తమకు అనువైన దానికి మారిపోవచ్చని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై జరుగుతున్నవి తప్పుడు ప్రచారాలని స్పష్టం చేసింది.

  • ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నుల పరంగా ఎలాంటి మార్పులూ లేవు.
  • ఆర్థిక చట్టం 2023 ప్రకారం పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్‌ 115బీఏసీ(1) కింద కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది.
  • గత ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్‌’గా వర్తిస్తుంది. 2024-25 మదింపు సంవత్సరం రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఈ విషయాన్ని గమనించాలి.
  • కొత్త పన్ను విధానాన్ని అర్థం చేసుకోవాలి. పాత పన్ను విధానంతో పోలిస్తే రేట్లు తక్కువ. పన్ను రాయితీల కోసం ఎలాంటి పెట్టుబడులూ చూపించాల్సిన అవసరం లేదు. రెండు విధానాల్లోనూ ప్రామాణిక తగ్గింపు రూ.50,000, కుటుంబ పింఛను రూ.15,000 మినహాయింపు లభిస్తుంది.
  • కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్‌’గా ఉన్నప్పటికీ.. పాత పన్ను విధానం లాభదాయకం అనుకుంటే, దాన్నే ఎంచుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

పన్ను శ్లాబుల విషయానికి వస్తే కొత్త పన్ను విధానం ప్రకారం

ఆదాయం  పన్ను%

రూ.3 లక్షల వరకు 0
రూ.3- 6లక్షల వరకు 5
రూ.6-9 లక్షల వరకు 10
రూ.9-12 లక్షల వరకు 15
రూ.12-15 లక్షల వరకు 20
రూ.15 లక్షలు ఆ పైన 30

గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఆదాయం రూ.7.50 లక్షల లోపు (ప్రామాణిక తగ్గింపు రూ.50వేలతో కలిసి) ఉన్నప్పుడు ఎలాంటి పన్ను భారం ఉండదు.

పాత పన్ను విధానంలో

ఆదాయం పన్ను%

రూ.2.5 లక్షల వరకు 0
రూ.2.5 - 5 లక్షల వరకు 5
రూ.5-10 లక్షల వరకు 20
రూ.10 లక్షలకు పైన 30

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని