‘ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్‌’ నిబంధన అమల్లోకి

ఒక ఫాస్టాగ్‌ను పలు వాహనాలకు వాడటం లేదా ఒక వాహనానికి పలు ఫాస్టాగ్‌లను అనుసంధానం చేయడం లాంటి వాటిని నిషేధించారు.

Published : 02 Apr 2024 01:57 IST

దిల్లీ: ఒక ఫాస్టాగ్‌ను పలు వాహనాలకు వాడటం లేదా ఒక వాహనానికి పలు ఫాస్టాగ్‌లను అనుసంధానం చేయడం లాంటి వాటిని నిషేధించారు. ఇందులో భాగంగా ‘ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్‌’ నిబంధనను సోమవారం నుంచి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అమల్లోకి తెచ్చింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం ఫాస్టాగ్‌ వినియోగదార్లు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో ఉంచుకుని, ‘ఒక వాహనం, ఒక ఫాస్టాగ్‌’ నిబంధన అమలు గడువును మార్చి 31 వరకు ఎన్‌హెచ్‌ఏఐ పొడిగించిన సంగతి తెలిసిందే. ‘ఏప్రిల్‌ 1 నుంచి ఒక వాహనానికి ఒకటికి మించి ఫాస్టాగ్‌లను వాడేందుకు అనుమతి లేద’ని సంబంధిత అధికారి తెలిపారు. ఫాస్టాగ్‌ అనేది.. దేశంలో ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు వ్యవస్థ. దీనిని ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహిస్తోంది. ప్రస్తుతం 8 కోట్ల మందికి పైగా ఫాస్టాగ్‌ వినియోగదార్లు ఉన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టిన తాజా చర్య.. ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూళ్ల బలోపేతానికి దోహదం చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని