ఆరోగ్య పానీయాలుగా విక్రయిస్తున్న ఉత్పత్తులను వర్గీకరించండి

తమ వెబ్‌సైట్‌లపై ‘ఆరోగ్య పానీయాలుగా’ విక్రయిస్తున్న ఆహార ఉత్పత్తులను వర్గీకరించాల్సిందిగా ఇ-కామర్స్‌ ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్స్‌ (ఎఫ్‌బీఓ)ను ఆహార భద్రత ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మంగళవారం ఆదేశించింది.

Published : 03 Apr 2024 01:48 IST

ఇ-కామర్స్‌ ఎఫ్‌బీఓలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశం

దిల్లీ: తమ వెబ్‌సైట్‌లపై ‘ఆరోగ్య పానీయాలుగా’ విక్రయిస్తున్న ఆహార ఉత్పత్తులను వర్గీకరించాల్సిందిగా ఇ-కామర్స్‌ ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్స్‌ (ఎఫ్‌బీఓ)ను ఆహార భద్రత ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మంగళవారం ఆదేశించింది. డెయిరీ ఆధారిత బెవరేజ్‌ మిక్స్‌ లేదా సెరియల్‌ ఆధారిత బెవరేజ్‌ మిక్స్‌ లేదా మాల్ట్‌ ఆధారిత బెవరేజ్‌ విభాగంలో ప్రొప్రైటరీ ఫుడ్‌ కింద ఆహార ఉత్పత్తులకు లైసెన్సులు ఇవ్వగా.. వాటిని హెల్త్‌ డ్రింక్‌, ఎనర్జీ డ్రింక్‌ విభాగాల్లో ఇ-కామర్స్‌ సంస్థలు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ చట్టం 2006 కింద హెల్త్‌ డ్రింక్‌ పదానికి నిర్వచనం లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. దీంతో ఇటువంటి ఉత్పత్తులను పానీయాలు లేదా బెవరేజెస్‌ విభాగం నుంచి తొలగించాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని