శామ్‌సంగ్‌ ఏఐ గృహోపకరణాలు

కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ ఇండియా ఏఐ ఆధారిత గృహోపకరణాలను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

Published : 04 Apr 2024 01:47 IST

వాషింగ్‌ మెషీన్లపై 70% వరకు విద్యుత్‌ ఆదా!

ముంబయి: కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ ఇండియా ఏఐ ఆధారిత గృహోపకరణాలను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. వేగంగా పెరుగుతున్న ప్రీమియం అప్లియెన్సెస్‌ విపణిలో వినియోగదార్ల అంచనాలను అధిగమించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బిస్పోక్‌ ఏఐ (కృత్రిమ మేధ)తో రూపొందిన కొత్త శ్రేణి ఉపకరణాలు భారతీయ గృహాల్లో స్మార్ట్‌గా జీవించేందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. అలాగే విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపింది. ఏఐ అల్గారిథమ్‌ ఆధారిత ఉపకరణాలు కావడంతో ఫ్రిడ్జ్‌లపై 10 శాతం వరకు, ఏసీలపై 20 శాతం వరకు, వాషింగ్‌ మెషీన్లపై 70 శాతం వరకు విద్యుత్‌ ఆదా అవుతుందని వివరించింది. ఈ ఉపకరణాలు ఇంటర్నెట్‌ అనుసంధానిత ఇన్‌-బిల్ట్‌తో రూపొందాయని.. కెమేరాలు, ఏఐ చిప్‌ల సాయంతో వినియోగదార్లు వీటిని స్మార్ట్‌థింగ్స్‌ యాప్‌ ద్వారా వినియోగించవచ్చని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని