వడ్డీ రేట్లు మారకపోవచ్చు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తొలి విధాన పరపతి సమీక్ష బుధవారం నుంచి ప్రారంభమైంది.

Published : 04 Apr 2024 01:48 IST

ఆర్‌బీఐ ఎమ్‌పీసీ సమావేశాలు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తొలి విధాన పరపతి సమీక్ష బుధవారం నుంచి ప్రారంభమైంది. దేశీయంగా ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంతోపాటు, అంతర్జాతీయంగా నెలకొన్న స్థూల ఆర్థిక పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టినట్లు బ్యాంకింగ్‌ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రంగంలో చేపట్టాల్సిన ప్రధాన మార్పులపైనా చర్చించే అవకాశాలున్నాయి. 2023 ఫిబ్రవరిలో కీలక వడ్డీ రేటు(రెపో) 6.5 శాతానికి చేరింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ మారలేదు. ఇప్పుడూ రెపో రేటులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రేపు ప్రకటించనున్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు చూపిస్తున్నప్పటికీ.. ఆర్‌బీఐ ఇప్పట్లో వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చనే నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎపుడు తగ్గొచ్చు?: ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నుంచే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వడ్డీ రేట్లను సవరించిన రెండు మూడు నెలల తర్వాతే అభివృద్ధి చెందుతున్న దేశాలు వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నాయని గుర్తు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు