10,000 మెగావాట్లకు అదానీ ‘గ్రీన్‌’ సామర్థ్యం

గుజరాత్‌లోని ఖావ్డా సౌర విద్యుత్‌ పార్క్‌లో 2,000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ బుధవారం ప్రారంభించింది.

Published : 04 Apr 2024 01:49 IST

భారత్‌లో ఈ సంస్థదే అత్యధికం

దిల్లీ: గుజరాత్‌లోని ఖావ్డా సౌర విద్యుత్‌ పార్క్‌లో 2,000 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ బుధవారం ప్రారంభించింది. తద్వారా భారత్‌లో 10,000 మెగావాట్లకు పైగా పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యమున్న తొలి కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం అదానీ గ్రీన్‌ ఎనర్జీ నిర్వహణలో ఉన్న పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యం 10,934 మెగావాట్లు. ఇందులో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,393 మెగావాట్లు కాగా.. పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 1,401 మెగావాట్లు, పవన-సౌర హైబ్రిడ్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం 2,140 మెగావాట్ల్లు. 2030 కల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యానికి చేరాలని కంపెనీ లక్ష్యం పెట్టుకుంది. సంస్థ ఉత్పత్తి చేసే 10,934 మెగావాట్ల విద్యుత్‌తో 58 లక్షల గృహాలకు కరెంటు సరఫరా చేయొచ్చు. వార్షికంగా 21 మిలియన్‌ టన్నుల మేర కర్బన ఉద్గారాలను  తగ్గించుకోవచ్చు. ‘భారత్‌లో పునరుత్పాదక విభాగంలో 10,000 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుకున్న తొలి కంపెనీగా నిలిచినందుకు గర్వపడుతున్నామ’ని ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని