ముంబయి- లండన్‌కు మరో విమాన సర్వీసు: వర్జిన్‌ అట్లాంటిక్‌

భారత విమానయాన విపణిలో ‘అపరిమిత గిరాకీ’ అవకాశాలున్న దృష్ట్యా... అక్టోబరు నుంచి ముంబయి- లండన్‌కు అదనంగా మరో రోజువారీ సర్వీసును ప్రారంభించనున్నట్లు వర్జిన్‌ అట్లాంటిక్‌ తెలిపింది.

Published : 04 Apr 2024 01:49 IST

భారత విమానయాన విపణిలో ‘అపరిమిత గిరాకీ’ అవకాశాలున్న దృష్ట్యా... అక్టోబరు నుంచి ముంబయి- లండన్‌కు అదనంగా మరో రోజువారీ సర్వీసును ప్రారంభించనున్నట్లు వర్జిన్‌ అట్లాంటిక్‌ తెలిపింది. అయితే ప్రభుత్వం నుంచి లభించే అనుమతులపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం లండన్‌ హీథ్‌రోకు దిల్లీ నుంచి రెండు; ముంబయి, బెంగళూరు నుంచి ఒకటి చొప్పున రోజువారీ విమాన సర్వీసులను ఈ సంస్థ నడుపుతోంది. లండన్‌- బెంగళూరు విమాన సర్వీసు మార్చి 31న ప్రారంభమైంది. అలాగే ఇండిగోతో కోడ్‌షేర్‌ భాగస్వామ్యాన్ని కూడా విస్తరించే ఉద్దేశంలో ఉన్నామని పేర్కొంది. ప్రస్తుతం కోడ్‌షేర్‌ భాగస్వామ్యం కింద వర్జిన్‌ అట్లాంటిక్‌ ప్రయాణికులకు అదనంగా 37 గమ్యస్థానాలకు ఇండిగో సర్వీసులను అందిస్తోంది. కోడ్‌షేరింగ్‌ కింద ఒక విమానయాన సంస్థకు తన ప్రయాణికులను తన భాగస్వామ్య విమానయాన సంస్థల ద్వారా ప్రయాణించేందుకు బుక్‌ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. తద్వారా తమ సర్వీసులు లేని గమ్యస్థానాలకు కూడా తమ ప్రయాణికులకు ప్రయాణ సదుపాయాన్ని కల్పించే అవకాశం ఆ విమానయాన సంస్థకు లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని