మోటరోలా ఎడ్జ్‌ 50 ప్రో విడుదల

ఈ ఏడాదిలో భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులను, దేశీయ విక్రయాలను రెట్టింపు చేసుకోవడంపై దృష్టి సారించినట్లు మోటరోలా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు (ఆసియా పసిఫిక్‌) ప్రశాంత్‌ మణి వెల్లడించారు.

Published : 04 Apr 2024 01:50 IST

దిల్లీ: ఈ ఏడాదిలో భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులను, దేశీయ విక్రయాలను రెట్టింపు చేసుకోవడంపై దృష్టి సారించినట్లు మోటరోలా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు (ఆసియా పసిఫిక్‌) ప్రశాంత్‌ మణి వెల్లడించారు. ఇందుకోసం పెట్టుబడులను పెంచనున్నట్లు తెలిపారు. మోటరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని మూడు దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలో ఒకటిగా ఉండాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో భారత్‌ తమకు అత్యంత ముఖ్య విపణిగా ఉండగలదని అన్నారు. మోటరోలా ఎడ్జ్‌ 50 ప్రో విక్రయాలు ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభం అవుతాయి. ధరల శ్రేణి రూ.31,999-35,999. ఒకవేళ ఆఫర్లు వర్తిస్తే.. ఈ ఫోను ధర రూ.27,999 నుంచి మొదలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని