భారత్‌లో ఏటా రూ.16,600 కోట్ల పెట్టుబడులు

అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ గ్రూప్‌, భారత్‌లో ప్రతి ఏటా 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌ దీక్షిత్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి (సీఓఓ) జొనాథన్‌ డి గ్రే వెల్లడించారు.

Published : 04 Apr 2024 01:52 IST

బ్లాక్‌స్టోన్‌ సీనియర్‌ ఎండీ అమిత్‌ దీక్షిత్‌

ముంబయి: అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ గ్రూప్‌, భారత్‌లో ప్రతి ఏటా 2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమిత్‌ దీక్షిత్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి (సీఓఓ) జొనాథన్‌ డి గ్రే వెల్లడించారు. విలీనాలు, కొనుగోళ్లకు వేగవంత అనుమతులతో పాటు సులభతర వ్యాపార నిర్వహణను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నమోదిత కంపెనీలను సులభంగా ప్రైవేటీకరించడంతోపాటు వాణిజ్య విషయాల్లో వివాదాలను వేగంగా పరిష్కరించాలని అభ్యర్థించారు. బ్లాక్‌స్టోన్‌ గ్రూప్‌, మన దేశంలో సుమారు రెండు దశాబ్దాల నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. భారత్‌లో తమ సంస్థ పీఈ పెట్టుబడులు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అధిక ప్రతిఫలాలను అందించాయని జొనాథన్‌ పేర్కొన్నారు. ఈ సంస్థ మన దేశంలో ఇప్పటి వరకు 50 బి.డాలర్ల (సుమారు రూ.4,15,000 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ముంబయిలో ఈ సంస్థకు 75 మందితో కూడిన పెట్టుబడుల బృందం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని