2024లో భారత్‌ వృద్ధి 7.5%!

భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 1.2 శాతం పెంచడం విశేషం.

Published : 04 Apr 2024 01:52 IST

ప్రపంచ బ్యాంక్‌ అంచనా

వాషింగ్టన్‌: భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 1.2 శాతం పెంచడం విశేషం. భారత్‌లో బలమైన వృద్ధితో పాటు పాకిస్థాన్‌, శ్రీలంకల్లో రికవరీతో దక్షిణాసియాలో వృద్ధి 6 శాతంగా నమోదు కావొచ్చని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. నివేదిక ప్రకారం, 2024, 2025లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా  దక్షిణాసియా నిలుస్తుందని పేర్కొంది. 2025లో ఈ ప్రాంతంలో 6.1 శాతం వృద్ధిని అంచనా వేసింది. దక్షిణాసియా ప్రాంత ఆర్థిక వ్యవస్థల్లో అధిక వాటా కలిగిన భారత ఉత్పత్తి వృద్ధి 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో 7.5 శాతానికి చేరుతుండటం, సేవలు, పరిశ్రమలు బలంగా ఉండటం కలిసొస్తుందని తెలిపింది. బంగ్లాదేశ్‌ ఉత్పత్తి మాత్రం 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో 5.7 శాతం పెరగొచ్చని వెల్లడించింది. ఇక్కడ అధిక ద్రవ్యోల్బణం, వాణిజ్య ఆంక్షలు, విదేశీ మారకపు నిల్వలు ఆర్థిక కార్యకలాపాలను నిరోధించవచ్చని ప్రపంచ బ్యాంక్‌ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని