2024లో భారత జీడీపీ 6.1% పెరగొచ్చు

2024లో భారత జీడీపీ 6.1 శాతమే వృద్ధి చెందొచ్చని మూడీస్‌ అనలిటిక్స్‌ అంచనా వేసింది. 2023లో నమోదైన 7.7% వృద్ధి కంటే ఇది బాగా తక్కువ.

Published : 13 Apr 2024 03:49 IST

మూడీస్‌ అనలిటిక్స్‌ అంచనా

దిల్లీ: 2024లో భారత జీడీపీ 6.1 శాతమే వృద్ధి చెందొచ్చని మూడీస్‌ అనలిటిక్స్‌ అంచనా వేసింది. 2023లో నమోదైన 7.7% వృద్ధి కంటే ఇది బాగా తక్కువ. కొవిడ్‌ సంక్షోభం, అనంతరం ఎదురైన ప్రతికూలతల వల్ల భారత వృద్ధిపై 4% వరకు ప్రభావం పడిందని మూడీస్‌ తెలిపింది. ‘దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలు ఈ ఏడాది బలమైన వృద్ధిని నమోదుచేయొచ్చు. కొవిడ్‌ అనంతర పరిణామాల వల్ల, రికవరీలో ఏర్పడిన జాప్యం ప్రభావం చూపొచ్చు’ అని మూడీస్‌ అనలిటిక్స్‌ పేర్కొంది. ‘అపాక్‌ ఔట్‌లుక్‌: లిజనింగ్‌ త్రూ ది నాయిస్‌’ పేరిట సంస్థ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్‌ మెరుగ్గా రాణిస్తోందని, గతేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2.5% కాగా.. ఆసియా పసిఫిక్‌ 3.8% వృద్ధి సాధించిందని వివరించింది. చైనా, భారత్‌లలో ద్రవ్యోల్బణ అనిశ్చితులు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని