42 లక్షల కార్లు అమ్ముడయ్యాయ్‌

మన దేశంలో ప్రయాణికుల వాహనాల (పీవీ-కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు 2023-24లో రికార్డు గరిష్ఠమైన 42,18,746 కు చేరాయి.

Published : 13 Apr 2024 03:50 IST

2023-24పై సియామ్‌ 

దిల్లీ: మన దేశంలో ప్రయాణికుల వాహనాల (పీవీ-కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు 2023-24లో రికార్డు గరిష్ఠమైన 42,18,746 కు చేరాయి. 2022-23లో కంపెనీల నుంచి డీలర్లకు పంపిణీ అయిన 38,90,114 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 8.4% అధికం. మరో 7 లక్షల పీవీలు ఎగుమతి అయ్యాయి. యుటిలిటీ వాహనాలకు భారీ గిరాకీ నమోదుకావడం కలిసొచ్చిందని వాహన పరిశ్రమ సంఘం సియామ్‌ శుక్రవారం వెల్లడించింది. 2022-23తో పోలిస్తే 2023-24లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.3% పెరిగి 1,79,74,365కు చేరాయి.

  • అన్ని విభాగాల వాహన అమ్మకాలు 2,12,04,846 నుంచి 12.5% వృద్ధితో 2,38,53,463కు చేరాయి. ఎగుమతులు మాత్రం 47,61,299 నుంచి 5.5% తగ్గి  45,00,492కు పరిమితమయ్యాయి.
  • ఆర్థిక వృద్ధి వల్లే: దేశ ఆర్థిక వృద్ధి 7.6 శాతంగా నమోదు కావడంతో, వాహన పరిశ్రమ 12.6% వృద్ధిని నమోదు చేయగలిగిందని సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. పీవీ విభాగంలో ఎస్‌యూవీలు సహా యుటిలిటీ వాహన విక్రయాలు 25.8% వృద్ధితో 25,20,691కి చేరాయన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంకా పుంజుకోనందున చిన్నకార్లు, ద్విచక్ర వాహన విభాగం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు.
  • మార్చిలో: పీవీ టోకు విక్రయాలు గతేడాది మార్చి నాటి 2,92,030 కంటే ఈ మార్చిలో 9% పెరిగి  3,17,976కు చేరాయి. ద్విచక్ర వాహన టోకు అమ్మకాలు 12,90,553 నుంచి 14,87,579కు పెరిగాయి. అన్ని విభాగాల్లో మొత్తం వాహనాల పంపిణీ 16,37,048 నుంచి 18,62,309కి చేరిందని సియామ్‌ తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని