5 నెలల కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

దేశీయంగా ఆహార ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ఠమైన 4.85 శాతానికి చేరింది.

Published : 13 Apr 2024 03:52 IST

దిల్లీ: దేశీయంగా ఆహార ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్ఠమైన 4.85 శాతానికి చేరింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా ఉంది. 2023 మార్చిలో ఇది 5.66 శాతంగా నమోదైంది. ఇంతకు ముందు 2023 అక్టోబరులో అత్యల్పంగా 4.83 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో 8.66 శాతంగా ఉండగా, మార్చిలో 8.52 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద (2% ఎక్కువ లేదా తక్కువగా) ఉంచాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

  • మార్చిలో గుడ్లు, సుగంధ ద్రవ్యాలు, పప్పుల ధరలు తగ్గాయి. కూరగాయలు, పళ్ల ధరలు పెరిగాయి. ఇంధన ధరలు కూడా తగ్గాయి.
  • మార్చిలో గ్రామీణ ప్రాంతాల్లో సగటు ద్రవ్యోల్బణం 5.45 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.14 శాతంగా నమోదైంది. ఒడిశాలో ద్రవ్యోల్బణం అత్యధికంగా 7.05 శాతంగా, దిల్లీలో అత్యల్పంగా 2.29 శాతంగా ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని