15 నిమిషాల్లో ఛార్జింగ్‌ అయ్యే విద్యుత్తు ఆటో

ప్రయాణికుల కోసం విద్యుత్‌ త్రిచక్ర వాహనాన్ని ఒమేగా సెకీ మొబిలిటీ శుక్రవారం విడుదల చేసింది.

Published : 13 Apr 2024 03:53 IST

ధర రూ.3,24,999

దిల్లీ: ప్రయాణికుల కోసం విద్యుత్‌ త్రిచక్ర వాహనాన్ని ఒమేగా సెకీ మొబిలిటీ శుక్రవారం విడుదల చేసింది. స్ట్రీమ్‌ సిటీ క్విక్‌గా వ్యవహరించే ఈ ఆటోలోని 8.8 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ 15 నిమిషాల్లోనే ఛార్జ్‌ అవుతుందని, ఒక్కసారి ఛార్జింగ్‌తో 126 కి.మీ వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఆటో ధర రూ.3,24,999 (ఎక్స్‌షోరూం). రెండు లక్షల కిలోమీటర్లు లేదా అయిదేళ్లు ఏది ముందైతే అప్పటివరకు వారెంటీ ఉంటుంది. 15 నిమిషాల్లో ఛార్జింగ్‌ వల్ల డ్రైవర్లకు సమయం వృథా కాదని ఒమేగా సెకీ మొబిలిటీ ఛైర్మన్‌, వ్యవస్థాపకుడు ఉదయ్‌ నారంగ్‌ వివరించారు. అత్యంత వేగంగా ఛార్జింగ్‌ చేసేందుకు అనువైన ఎక్స్‌పోనెంట్‌ ర్యాపిడ్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ ప్రస్తుతం దేశంలోని 6 నగరాల్లో అందుబాటులో ఉంది. ‘ఛార్జింగ్‌ సదుపాయాన్ని మరింతగా అందుబాటులో తెచ్చేందుకు ఈ ఏడాది దిల్లీ- ఎన్‌సీఆర్‌, బెంగళూరులలో 100 ఛార్జింగ్‌ స్టేషన్లను ఎక్స్‌పోనెంట్‌ ప్రారంభించనుంది. ఆ తర్వాత చెన్నై, అహ్మదాబాద్‌, కోల్‌కతా, హైదరాబాద్‌లకు ఛార్జింగ్‌ సదుపాయాలను విస్తరించనుంద’ని కంపెనీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని