చైనా నుంచి కంప్యూటర్‌ దిగుమతులు 3% తగ్గాయ్‌

చైనా నుంచి మన దేశానికి వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతులు 2023 నవంబరు-2024 ఫిబ్రవరి మధ్య, ఏడాది క్రితంతో పోలిస్తే 3% తగ్గి 917 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,600 కోట్ల)కు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Published : 14 Apr 2024 02:52 IST

2023 నవంబరు-2024 ఫిబ్రవరిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ

దిల్లీ: చైనా నుంచి మన దేశానికి వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతులు 2023 నవంబరు-2024 ఫిబ్రవరి మధ్య, ఏడాది క్రితంతో పోలిస్తే 3% తగ్గి 917 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,600 కోట్ల)కు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022 నవంబరు-2023 ఫిబ్రవరి మధ్య 950.22 మి.డాలర్ల విలువైన కంప్యూటర్లు దిగుమతి అయ్యాయి. 2023 జులై-అక్టోబరు మధ్య నమోదైన 1.75 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.14,525 కోట్ల) విలువైన దిగుమతులతో పోలిస్తే 2023 నవంబరు-2024 ఫిబ్రవరి మధ్య ఈ దిగుమతులు 48% తగ్గాయని పేర్కొంది. ప్రపంచ దేశాల నుంచి మన విపణిలోకి మొత్తం వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతులు 2023 నవంబరు-2024 ఫిబ్రవరి మధ్య 55% క్షీణించి (వార్షిక ప్రాతిపదికన) 1.06 బి.డాలర్ల (సుమారు రూ.8,800 కోట్ల)కు పరిమితమయ్యాయని వివరించింది. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులపై 2023 అక్టోబరు 19న ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దిగుమతిదార్ల పరిమాణం, విలువను తెలుసుకున్నాకే, విదేశాల నుంచి ఐటీ హార్డ్‌వేర్‌ను దిగుమతి చేసుకోడానికి అనుమతించింది. ఈ కొత్త దిగుమతుల నిర్వహణ వ్యవస్థ ‘ఇంపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ద్వారా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు మన దేశంలోకి ఎన్ని వస్తున్నాయో పర్యవేక్షించేందుకు వీలవుతుంది. మార్కెట్‌లో సరఫరాకు ఇబ్బంది లేకుండా, గజిబిజి సృష్టించకుండా ఉండేందుకు ఇది దోహదం చేస్తుందనేది ప్రభుత్వ లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని