శాట్‌కామ్‌ స్పెక్ట్రమ్‌పై ట్రాయ్‌ అభిప్రాయం కోరనున్న డాట్‌

శాట్‌కామ్‌ సేవల కోసం కేటాయించనున్న స్పెక్ట్రమ్‌కు ధర నిర్ణయించేందుకు, లైసెన్సింగ్‌ ప్రక్రియలపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ అభిప్రాయాలను టెలికాం విభాగం (డాట్‌) కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Published : 15 Apr 2024 03:25 IST

దిల్లీ: శాట్‌కామ్‌ సేవల కోసం కేటాయించనున్న స్పెక్ట్రమ్‌కు ధర నిర్ణయించేందుకు, లైసెన్సింగ్‌ ప్రక్రియలపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ అభిప్రాయాలను టెలికాం విభాగం (డాట్‌) కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.. స్పేస్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ సేవలకు స్పెక్ట్రమ్‌ కేటాయింపుపై సంప్రదింపుల పత్రాన్ని ఈ నెల 6న ట్రాయ్‌ విడుదల చేసింది. అయితే కొత్త టెలికమ్యూనికేషన్‌ చట్టం ప్రకటన తర్వాత, మళ్లీ డాట్‌కు పంపింది. తాజాగా స్పెక్ట్రమ్‌ ధరల నిర్ణయం, లైసెన్సింగ్‌ విధివిధానాల కోసం ట్రాయ్‌ను డాట్‌ సంప్రదించనుందని సమాచారం. మారుమూల ప్రదేశాల్లో ఇంటర్నెట్‌ అనుసంధానత కోసం శాట్‌కామ్‌ సేవలు వినియోగిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని