పసిడి బలంగానే!

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఇంకా బలంగానే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే మంచి ప్రతిఫలాన్ని అందించినందున.. కొంత మేర లాభాలు స్వీకరించడం మంచిది.

Published : 15 Apr 2024 03:30 IST

కమొడిటీస్‌
ఈ వారం

పసిడి

సిడి జూన్‌ కాంట్రాక్టు ఇంకా బలంగానే కనిపిస్తోంది. అయితే ఇప్పటికే మంచి ప్రతిఫలాన్ని అందించినందున.. కొంత మేర లాభాలు స్వీకరించడం మంచిది. పసిడి కాంట్రాక్టు ఈ వారమూ సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,898 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.73,716; రూ.74,653 వరకు రాణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ      రూ.71,143 దిగువన కదలాడితే రూ.70,206; రూ.69,388 వరకు దిగిరావచ్చు. రూ.70,079 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మేలు.


వెండి

వెండి మే కాంట్రాక్టు రూ.85,868 కంటే ఎగువన చలించకుంటే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయికి ఎగువన చలిస్తే రూ.87,282 వరకు పెరుగుతుందని భావించొచ్చు. ప్రస్తుతం కాంట్రాక్టుకు రూ.81,884 వద్ద తక్షణ మద్దతు; రూ.84,583 వద్ద తక్షణ నిరోధం కనిపిస్తోంది.


ప్రాథమిక లోహాలు

రాగి ఏప్రిల్‌ కాంట్రాక్టు సానుకూల ధోరణిలో చలిస్తే రూ.842.45 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే రూ.864.45 వరకు పెరగొచ్చు. అదేవిధంగా కిందకు వస్తే రూ.799.25 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.777.05 వరకు పడిపోవచ్చు.

  • సీసం ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.191 కంటే పైన చలించకుంటే దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయికి పైన చలిస్తే రూ.193.25 వరకు రాణిస్తుంది.
  • జింక్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.224.35 కంటే దిగువన కదలాడితే మరింతగా దిద్దుబాటు కావచ్చు. రూ.238 కంటే దిగువకు రాకుంటే రూ.254 వరకు పెరగొచ్చు.
  • అల్యూమినియం ఏప్రిల్‌ కాంట్రాక్టు కొంత ప్రతికూల ధోరణిలో కదలాడేందుకు అవకాశం ఉంది. అయితే రూ.221.45 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.216.45కు దిగిరావచ్చు.

ఇంధన రంగం

  • ముడి చమురు ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.7,057 కంటే దిగువన కదలాడకుంటే సానుకూల ధోరణికి అవకాశం ఉంటుంది. అయితే రూ.7,322 వద్ద కొంత నిరోధానికి ఆస్కారం ఉంది. దీనిని అధిగమిస్తే రూ.7,454; రూ.7,587 వరకు పెరగొచ్చు. ఒకవేళ రూ.7,057 కంటే దిగువన చలిస్తే రూ.6,924; రూ.6,792 వరకు దిద్దుబాటు కావచ్చు.
  • సహజవాయువు ఏప్రిల్‌ కాంట్రాక్టు  రూ.139.25 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే.

వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.17,081 ఎగువన కదలాడకుంటే.. ప్రతికూల ధోరణి కొనసాగుతుంది. రూ.15,144 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.14,642; రూ.14,168 వరకు దిగిరావచ్చు. ఒకవేళ రూ.16,594 ఎగువన కదలాడితే రూ.17,542; రూ.17,793 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.
  • పత్తి క్యాండీ మే కాంట్రాక్టు రూ.58,973 కంటే దిగువన కదలాడితే రూ.58,086కు పడిపోవచ్చు. రూ.61,273 ఎగువన చలిస్తే రూ.62,686 వరకు రాణిస్తుంది.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని