అదానీ షేర్లలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ 59% పెరిగింది

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టిన పెట్టుబడులపై 2023-24లో 59% ప్రతిఫలం పొందినట్లు , ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దిల్లీ: అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టిన పెట్టుబడులపై 2023-24లో 59% ప్రతిఫలం పొందినట్లు , ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Published : 15 Apr 2024 03:37 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో పెట్టిన పెట్టుబడులపై 2023-24లో 59% ప్రతిఫలం పొందినట్లు , ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత భారీగా పడిపోయిన అదానీ గ్రూప్‌ షేర్ల విలువలు గత ఆర్థిక సంవత్సరంలో మళ్లీ బలంగా పుంజుకున్నాయి. అందువల్లే 2023 మార్చి 31 నాటికి రూ.38,471 కోట్లుగా ఉన్న ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ 2024 మార్చి 31 నాటికి రూ.61,210 కోట్లకు చేరాయి. అంటే రూ.22,378 కోట్ల ప్రతిఫలం లభించింది.

  • హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 150 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12.45 లక్షల కోట్ల) మేర ఆవిరైంది. తదుపరి పరిణామాలకు తోడు, ఆయా సంస్థల ఆర్థిక ఫలితాలు బాగుండటం, వ్యాపారాలను విస్తరించడంతో అదానీ షేర్లు బలంగా పుంజుకున్నాయి. గ్రూప్‌లో ప్రధాన కంపెనీలైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ 83%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 68.4% చొప్పున పెరిగాయి.
  • అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.8,495.31 కోట్ల నుంచి రూ.14,305.53 కోట్లకు చేరింది. అదానీ పోర్ట్స్‌లో పెట్టుబడుల విలువ రూ.12,450.09 కోట్ల నుంచి రూ.22,776.89 కోట్లకు చేరింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రెండింతలకు పైగా పెరిగి రూ.3,937.62 కోట్లకు చేరింది. అదానీ టోటల్‌ గ్యాస్‌, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ కంపెనీల్లోనూ ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ గణనీయంగా పెరిగింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని