ఓలా ఎస్‌1 ఎక్స్‌ ధర రూ.10,000 వరకు తగ్గింపు

ఓలా ఎలక్ట్రిక్‌ ప్రారంభ స్థాయి స్కూటర్‌ ‘ఎస్‌1 ఎక్స్‌’ ధరను రూ.5000- 10,000 వరకు తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్‌1 ఎక్స్‌ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది.

Published : 16 Apr 2024 03:46 IST

దిల్లీ: ఓలా ఎలక్ట్రిక్‌ ప్రారంభ స్థాయి స్కూటర్‌ ‘ఎస్‌1 ఎక్స్‌’ ధరను రూ.5000- 10,000 వరకు తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్‌1 ఎక్స్‌ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది. వీటి ధరల శ్రేణి రూ.79,999- 1,09,999 మధ్య ఉంది. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని, వీటి డెలివరీ వచ్చే వారం ప్రారంభిస్తామని ఓలా ఎలక్ట్రిక్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ అధికారి అన్షుల్‌ ఖండేల్‌వాల్‌ పేర్కొన్నారు. కొత్త ధరల ప్రకారం.. ఎస్‌1 ఎక్స్‌ (4 కిలోవాట్‌ హవర్‌ బ్యాటరీ) ధర రూ.1,09,999 నుంచి రూ.99,999కు తగ్గింది. 3 కిలోవాట్‌ హవర్‌ బ్యాటరీ కలిగిన స్కూటర్‌ ధర రూ.89,999 నుంచి రూ.84,999కు పరిమితమైంది. 2 కిలోవాట్‌ హవర్‌ బ్యాటరీ స్కూటర్‌ ధరను రూ.79,999 నుంచి రూ.69,999 (పరిచయ ధర)కు తగ్గించారు. విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకే.. స్కూటర్‌ సగటు ధరను రూ.లక్షకు చేర్చినట్లు ఖండేల్‌వాల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని