బైజూస్‌ ఇండియా సీఈఓ అర్జున్‌ మోహన్‌ రాజీనామా

బైజూస్‌ బ్రాండ్‌పై సేవలందించే ఎడ్‌టెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ భారత కార్యకలాపాలకు సీఈఓగా ఉన్న అర్జున్‌ మోహన్‌ తన పదవికి రాజీనామా చేశారు. అంతర్జాతీయ వ్యాపారాలకు సీఈఓగా గతేడాది జులైలో బైజూస్‌లోకి మోహన్‌ చేరారు.

Published : 16 Apr 2024 03:47 IST

రోజువారీ కార్యకలాపాల బాధ్యతలు రవీంద్రన్‌కు

దిల్లీ: బైజూస్‌ బ్రాండ్‌పై సేవలందించే ఎడ్‌టెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ భారత కార్యకలాపాలకు సీఈఓగా ఉన్న అర్జున్‌ మోహన్‌ తన పదవికి రాజీనామా చేశారు. అంతర్జాతీయ వ్యాపారాలకు సీఈఓగా గతేడాది జులైలో బైజూస్‌లోకి మోహన్‌ చేరారు. ఆ తర్వాత సెప్టెంబరులో భారత కార్యకలాపాల బాధ్యతలనూ ఆయనకు అప్పగించారు. ఈ బాధ్యత స్వీకరించాక కంపెనీ పునర్‌వ్యవస్థీకరణను చేపట్టారు. బైజూస్‌లో 4,000 మంది ఉద్యోగుల లేఆఫ్‌కు ఇది దారితీసింది. ఇప్పుడు సీఈఓగా మోహన్‌ రాజీనామా నేపథ్యంలో కంపెనీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతలను బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ నిర్వహించనున్నారు. మరోవైపు వ్యాపార మార్పుచేర్పుల్లో భాగంగా దానిని మూడు విభాగాలుగా (ద లెర్నింగ యాప్‌, ఆన్‌లైన్‌ క్లాసెస్‌- ట్యూషన్‌ సెంటర్స్‌, టెస్ట్‌- ప్రిప్‌) విభజిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఒక్కో విభాగానికి ఒక్కో సారథి ఉంటారని.. వీళ్లు స్వతంత్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తారని పేర్కొంది. ‘బైజూస్‌ ఇండియా సీఈఓగా వైదొలుగుతున్న అర్జున్‌ మోహన్‌ నేతృత్వంలో ఏడు నెలలుగా కార్యకలాపాలు, వ్యయాలపై జరిపిన మదింపు ఆధారంగా  మార్పు చేర్పులు చేపట్టాం. కంపెనీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతలను బైజూ రవీంద్రన్‌ తీసుకుంటుండటంతో, కొత్త దిశగా కంపెనీ వెళ్లడాన్ని మనం చూడొచ్చ’ని కంపెనీ తెలిపింది. మోహన్‌ కంపెనీకి బయటి నుంచి సలహాదారు పాత్ర నిర్వహిస్తారని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని