సోనీతో విలీనానికి ఎన్‌సీఎల్‌టీ వద్ద దరఖాస్తు ఉపసంహరణ: జీ

సోనీ కంపెనీతో విలీనాన్ని అమలు చేయాలని కోరుతూ జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) వద్ద దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జెడ్‌ఈఈఎల్‌) వెల్లడించింది.

Published : 17 Apr 2024 01:36 IST

దిల్లీ: సోనీ కంపెనీతో విలీనాన్ని అమలు చేయాలని కోరుతూ జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) వద్ద దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జెడ్‌ఈఈఎల్‌) వెల్లడించింది. బోర్డు ద్వారా అందిన న్యాయ సలహా ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ‘వాటాదార్లకు అధిక విలువ సృష్టించేందుకు వృద్ధిపరమైన, వ్యూహాత్మక అవకాశాల మదింపునకు ఈ నిర్ణయం కంపెనీకి ఉపయోగపడుతుంది. యాజమాన్యం వేసే ప్రతి అడుగును వ్యూహాత్మక కార్యాచరణ ద్వారా ఎప్పటికప్పుడు మదింపు చేసేందుకు, సమయానుసరంగా మార్గనిర్దేశం చేసేందుకు బోర్డు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంద’ని జెడ్‌ఈఈఎల్‌ తెలిపింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సోనీ గ్రూపు సంస్థలు కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్‌ మధ్య కుదిరిన విలీన ఒప్పందం అమలుకు ఆదేశాలివ్వాలంటూ జనవరి 24న ఎన్‌సీఎల్‌టీ ముంబయి ధర్మాసనం వద్ద జెడ్‌ఈఈఎల్‌ దరఖాస్తు సమర్పించింది. అంతకుమందు జెడ్‌ఈఈఎల్‌, తమ భారత సంస్థ విలీనం కోసం కుదుర్చుకున్న 10 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని జనవరి 22న సోనీ గ్రూపు రద్దు చేసుకుంది. విలీనానంతర సంస్థకు ఎవరు సారథ్యం వహిస్తారనే విషయంపై సందిగ్థత నెలకొనడం ఇందుకు కారణమైంది. ఈ ఒప్పందం రెండేళ్ల కిందట కుదిరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని