ఫ్లిప్‌కార్ట్‌ వేసవి విక్రయాలు నేటి నుంచి

ఫ్లిప్‌కార్ట్‌ వార్షిక వేసవి విక్రయాలు ఈనెల 17న ప్రారంభమై 23 వరకు కొనసాగనున్నాయి. ఈ విక్రయాల్లో ఏసీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌ కూలర్లు, ఫ్యాన్లు లాంటి గృహోపకరణాలను ఆకర్షణీయ ధరల్లో వినియోగదార్లు పొందొచ్చని సంస్థ పేర్కొంది.

Published : 17 Apr 2024 01:37 IST

దిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌ వార్షిక వేసవి విక్రయాలు ఈనెల 17న ప్రారంభమై 23 వరకు కొనసాగనున్నాయి. ఈ విక్రయాల్లో ఏసీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌ కూలర్లు, ఫ్యాన్లు లాంటి గృహోపకరణాలను ఆకర్షణీయ ధరల్లో వినియోగదార్లు పొందొచ్చని సంస్థ పేర్కొంది. వేసవిలో ఎండ వేడిని తట్టుకునేందుకు వినియోగదార్లకు ఇది మంచి అవకాశమని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. వినియోగదార్ల అవసరాలు, వారి బడ్జెట్‌కు తగ్గట్లుగా వివిధ రకాల బ్రాండ్ల శీతల గృహోపకరణాలను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. పాత పరికరాలను మార్చుకుని స్టార్‌రేటింగ్‌ ఉన్న కొత్త పరికరాలను కొనుగోలు చేసుకోవడం ద్వారా, విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఉత్పత్తుల ధర రూ.1,299 నుంచి ప్రారంభం అవుతుందని.. క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజీ ఆఫర్లు, ట్యాప్‌ అండ్‌ విన్‌, సూపర్‌ కాయిన్లపై ఆఫర్లు లాంటి ఆఫర్లను పొందొచ్చని తెలిపింది. వడ్డీలేని సులభ వాయిదాలు, క్యాష్‌ ఆన్‌ డెలివరీ, ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఈఎంఐ లాంటి చెల్లింపు సదుపాయాలు కూడా ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు