రెండేళ్లలో రూ.1000 కోట్ల విక్రయాలు!

ఆధునిక సాంకేతికతతో పరుపులను తయారు చేస్తున్న ద స్లీప్‌ కంపెనీ, రానున్న రెండేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలనే లక్ష్యంతో ఉంది.

Published : 17 Apr 2024 01:40 IST

ద స్లీప్‌ కంపెనీ

ఈనాడు, హైదరాబాద్‌: ఆధునిక సాంకేతికతతో పరుపులను తయారు చేస్తున్న ద స్లీప్‌ కంపెనీ, రానున్న రెండేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలనే లక్ష్యంతో ఉంది. దీంతోపాటు ఐపీఓకి వెళ్లాలనీ ఆలోచిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో   రూ.350 కోట్లకు పైగా టర్నోవర్‌ సాధించామన్నారు. దేశంలో మొత్తం పరుపుల విపణి రూ.16వేల కోట్ల స్థాయిలో ఉంటే, ఇందులో సంఘటిత రంగం వాటా రూ.7వేల కోట్లని పేర్కొన్నారు. ఇందులో ఏటా 10% వృద్ధి నమోదవుతుంటే, తమ కంపెనీ 160% వృద్ధి సాధిస్తోందన్నారు. ఆధునిక జీవన శైలికి తగ్గట్టుగా పరుపులను అందించడమే ఇందుకు కారణమన్నారు. హైదరాబాద్‌లో 8 విక్రయ కేంద్రాలున్నాయని, వచ్చే మార్చికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, వరంగల్‌లోనూ కేంద్రాలున్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 75 కేంద్రాలుండగా, 2026కు ఇవి 200 అవుతాయని తెలిపారు. సిరీస్‌ సి ఫండింగ్‌లో భాగంగా రూ.184 కోట్ల పెట్టుబడులు సమీకరించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు